Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి: బత్తిని శ్రీనివాస్ గౌడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి: బత్తిని శ్రీనివాస్ గౌడ్

ఖానాపురం పున్నమి ప్రతినిధి: విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి కేటాయించిన నిధులు, ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర బీసీ సెల్ నాయకులు, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
2024 నుంచి 2026 వరకు విద్యాశాఖకు మొత్తం రూ.71,071 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొంటూ, ఆ నిధులను ఏయే కార్యక్రమాలకు ఖర్చు చేశారో ప్రభుత్వం స్పష్టమైన వివరాలు వెల్లడించాలని ప్రశ్నించారు.
యువ వికాసం పథకం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఐఐటీ, జేఈఈ, నీట్ ఉచిత శిక్షణ, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, ఐటీఐ కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చడం వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు.
అలాగే గురుకుల భవనాల నిర్మాణం, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఏటా జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాలు, పబ్లిక్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ప్రోత్సాహకాలు వంటి హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడం విద్యార్థులు, యువతను నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి యువతకు అండగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి: బత్తిని శ్రీనివాస్ గౌడ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *