Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

పి ఆర్ సి పై కాలయాపన తగదు –టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు పి. చంద్ర శేఖర్ రావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పి ఆర్ సి పై కాలయాపన తగదు –టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు పి. చంద్ర శేఖర్ రావు

వార్త ముఖ్యాంశాలు

  • పిఆర్సి పై కాలయాపన తగదు- ---టియస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి చంద్రశేఖర రావు .................................................................................
  • తెలంగాణ రెండవ పిఆర్సీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన కాలయాపన చేస్తుందని, వెంటనే పిఆర్సి అమలు చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు.
  • ఈరోజు లింగాల ఘన్పూర్ మండల మహాసభలో భాగంగా నెల్లుట్ల పాఠశాలలో నిర్వహించిన సమావేశం మండల అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పి చంద్రశేఖర రావు గారు పాల్గొని మాట్లాడారు.

పిఆర్సి పై కాలయాపన తగదు-
—టియస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి చంద్రశేఖర రావు
………………………………………………………………………
తెలంగాణ రెండవ పిఆర్సీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన కాలయాపన చేస్తుందని, వెంటనే పిఆర్సి అమలు చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు.
ఈరోజు లింగాల ఘన్పూర్ మండల మహాసభలో భాగంగా నెల్లుట్ల పాఠశాలలో నిర్వహించిన సమావేశం మండల అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన జరిగింది
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పి చంద్రశేఖర రావు గారు పాల్గొని మాట్లాడారు. “పిఆర్సీ విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నదని , ఉద్యోగ ,ఉపాధ్యాయ పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అసంతృప్తి తొలగాలంటే పిఆర్సీని వెంటనే ప్రకటించడం మినహా ప్రభుత్వము దగ్గర వేరే దారి లేదని తెలియజేశారు. 40 నెలల కాలంగా ఆలస్యమైన పిఆర్సీి గతంలో ఎప్పుడూ లేదని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మీనమేషాలు లెక్కిస్తుందని, ఉద్యోగులు సమాజంలో భాగం అని గ్రహించాలని హితవు పలికారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో ఇదే విధమైన కాలయాపన చేస్తే వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది ఎదుర్కొంటుందని తెలియజేశారు. ప్రభుత్వం తక్షణమే పిఆర్సీని ప్రకటించడంతోపాటు, సిపిఎస్ రద్దు చేయడం, పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నిర్ణీత కాలపట్టిక రూపొందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు పేరుతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. యాప్ ల భారం తగ్గించి, ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయాలని కోరారు.
2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వెంటనే అమలు చేయాలని కోరారు. అదేవిధంగా అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ని విడుదల చేయాలని, సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి డైట్ లెక్చరర్లు, ఎంఈఓ, డిప్యూటీఇఓ పదోన్నతులను ఇవ్వాలని కోరారు. కేజీబీవీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, గురుకుల ఉపాధ్యాయులకు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 హెడ్ ద్వారా వేతనాలు చెల్లిస్తూ, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లోని పండిట్, పీఈటి పోస్టులు అప్గ్రేడ్ చేసి పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నెలకు ₹2,000 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులకు విడుదల చేయాలని కోరారు. పాఠశాలలకు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు
అనంతరం నూతన మండల కమిటీ ని ఎన్నుకున్నారు
*💐టిఎస్‌యూటిఎఫ్‌ లింగాల ఘనపూర్ మండల నూతన కమిటీ 💐*
నెల్లుట్లలో నిర్వహించిన మండల సభలో టిఎస్‌యూటిఎఫ్‌ లింగాల ఘనపూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు పి చంద్రశేఖర రావు గారు ఎన్నికల అధికారిగా & జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేష్ ఎన్నికల పరిశీలకులుగా & జిల్లా కార్యదర్శి జి కృష్ణ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరించడం జరిగింది.
*అధ్యక్షులు* – T లక్ష్మణ్ గౌడ్
*ప్రధాన కార్యదర్శి* – E నర్సింహులు
*ఉపాధ్యక్షులు(1)*- Ch సమ్మక్క
*ఉపాధ్యక్షులు(2)* – K ఇంద్రసేనా రెడ్డి
*కోశాధికారి* – T నవీన్ కుమార్
*కార్యదర్శులు:*
● T మార్తా
● Ch శ్రీకాంత్
● P సుజల
● P మర్రెడ్డి
*ఆడిట్ కమిటీ*
కన్వీనర్- P రాజశంకర్
*మహిళా కమిటీ*
కన్వీనర్- T సౌజన్య
*స్కూల్ కాంప్లెక్స్ లింగాల ఘనపూర్ కమిటీ*
కన్వీనర్- సాగర్
*స్కూల్ కాంప్లెక్స్ నెల్లుట్ల కమిటీ*
కన్వీనర్ – K శ్రీనివాస్
*మోడల్ స్కూల్ కమిటీ*
కన్వీనర్ – Y సంతోష్ రెడ్డి
*KGBV కమిటీ*
కన్వీనర్ – S ఎలిజబెత్ రాణి
*ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కమిటీ*
కన్వీనర్ – Ch శ్రీకాంత్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *