Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

మింది పాఠశాలకు జర్నలిస్టుల చేయూత ఏపీడబ్ల్యూజేఎఫ్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మింది పాఠశాలకు జర్నలిస్టుల చేయూత ఏపీడబ్ల్యూజేఎఫ్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు

విశాఖ గాజువాక (పున్నమి ప్రతినిధి): గురుశిష్య సంప్రదాయం మానవజాతికి శ్రీరామరక్ష అని మింది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. అనంతలక్ష్మి అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మింది ప్రాథమిక పాఠశాలలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు కుర్చీలు అందజేయడంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధానోపాధ్యాయురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ, తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, ఇతరులు సహకారం అందించడం అభినందనీయమన్నారు. అందరి సహకారంతో పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి చేయూతనిచ్చిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.

గౌరవ అతిథిగా పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడ ఎంతటి స్థాయికి చేరుకున్నా తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలలు, కళాశాలలను మరిచిపోకూడదన్నారు. తమ మూలాలను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఫెడరేషన్ విస్తృతంగా నిర్వహిస్తోందని తెలిపారు.

ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి. నారాయణ, కార్యదర్శి జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గత రెండు రోజులుగా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, మరికొద్ది రోజులపాటు ఇవి కొనసాగుతాయని వెల్లడించారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసరావు సమకూర్చిన కుర్చీలు, పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రిని పాఠశాల ఉపాధ్యాయులకు జర్నలిస్టు సంఘ నాయకులు అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. అనంతలక్ష్మి, ఉపాధ్యాయులు డి. సత్యనారాయణ, వి. రమేష్, జి. నర్సింగరావు, నిరూపమా పరదేశి, బ్రాడ్‌కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, ఫెడరేషన్ ఉపాధ్యక్షులు నగేష్ బాబు, జాయింట్ సెక్రటరీ రాజశేఖర్, గాజువాక సంఘ కార్యదర్శి నాయుడు బాబు, జగన్ తదితర జర్నలిస్టులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని పలువురు ఆకాంక్షించారు.

మింది పాఠశాలకు జర్నలిస్టుల చేయూత ఏపీడబ్ల్యూజేఎఫ్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు

మింది పాఠశాలకు జర్నలిస్టుల చేయూత ఏపీడబ్ల్యూజేఎఫ్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు

మింది పాఠశాలకు జర్నలిస్టుల చేయూత ఏపీడబ్ల్యూజేఎఫ్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు

మింది పాఠశాలకు జర్నలిస్టుల చేయూత ఏపీడబ్ల్యూజేఎఫ్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *