Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

చిన్న వయసులో పెళ్లి నీ జీవితానికి భారమే తల్లి.. బాల్యవివాహాలకు స్వస్తి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చిన్న వయసులో పెళ్లి నీ జీవితానికి భారమే తల్లి.. బాల్యవివాహాలకు స్వస్తి.

బాలికల భవిష్యత్తుకు భరోసా!
బాలల హక్కుల పరిరక్షణే లక్ష్యం… బాలికల సాధికారతే ధ్యేయం!
KGBV పద్మనాభంలో బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సు**

**పద్మనాభం (పున్నమి ప్రతినిధి) నవంబర్ 6 ::**

బాల్య వివాహాలను నిర్మూలించి, ప్రతి బాలికకు విద్య, ఆరోగ్యం, భద్రతతో కూడిన ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా పద్మనాభం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)లో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, మిషన్ వాత్సల్య పథకం, జిల్లా బాలల సంరక్షణ విభాగం (DCPU), విశాఖపట్నం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన, దత్తత మాస ఉత్సవం ప్రాముఖ్యత, బాలల హక్కులు, సంరక్షణ చట్టాలు, బాలికల సాధికారత అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలల సంక్షేమ కమిటీ (CWC) సభ్యురాలు **శ్రీమతి పి. రాజేశ్వరి**, జిల్లా బాలల సంరక్షణ అధికారి **శ్రీ కె. హరి కృష్ణ** హాజరై విద్యార్థినులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పి. రాజేశ్వరి మాట్లాడుతూ, బాల్య వివాహ నిరోధక చట్టం (PCMA)-2006 ప్రకారం బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహాలు జరగాలని సూచించారు. కిశోరి వికాసం కార్యక్రమం ద్వారా కౌమారదశలో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం వంటి అంశాలపై ప్రతి బాలిక అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.

అలాగే పోక్సో (POCSO)-2012 చట్టం గురించి వివరిస్తూ మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడా, వ్యక్తిగత భద్రత, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత, ఆన్‌లైన్ వేధింపుల నుంచి రక్షణ పొందే మార్గాలను వివరించారు. పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించే చట్టబద్ధమైన దత్తత ప్రక్రియను CARA నిబంధనల ప్రకారమే చేపట్టాలని సూచించారు. బాలికల రక్షణ, విద్య, సమాన అవకాశాల కల్పనలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు.

జిల్లా బాలల సంరక్షణ అధికారి కె. హరి కృష్ణ మాట్లాడుతూ, బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన **’బాల్ వివాహ్ ముక్త్ భారత్’ 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమం** ప్రాధాన్యతను వివరించారు. బాల్య వివాహాల వల్ల బాలికల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు విద్య, భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమవుతాయని తెలిపారు. ప్రతి బాలిక ఉన్నత విద్యను అభ్యసించి, తన లక్ష్యాలను సాధించి, ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న, తప్పిపోయిన, నిర్లక్ష్యానికి గురైన పిల్లలకు తక్షణ సహాయం అందించే **1098 చైల్డ్ హెల్ప్‌లైన్** సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

అనంతరం విద్యార్థినులతో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించబోమని, తమ పరిసరాల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వాటిని అడ్డుకునేందుకు కృషి చేస్తామని విద్యార్థినులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం సోషల్ వర్కర్ **కె. నరేంద్ర**, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ **జి. రఘు**, కేస్ వర్కర్ **ఎస్. ఎల్లయ్య**, ప్రిన్సిపాల్ శ్రీమతి **కె. గ్రేస్ లిల్లీ**, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

చిన్న వయసులో పెళ్లి నీ జీవితానికి భారమే తల్లి.. బాల్యవివాహాలకు స్వస్తి.

చిన్న వయసులో పెళ్లి నీ జీవితానికి భారమే తల్లి.. బాల్యవివాహాలకు స్వస్తి.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *