Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విజయం ఒక బాధ్యత.. ప్రజాసేవే లక్ష్యం.. ఐదో వార్డ్ విజేతలకు.. ఎంపీ భరత్ ప్రత్యేక అభినందనలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విజయం ఒక బాధ్యత.. ప్రజాసేవే లక్ష్యం.. ఐదో వార్డ్ విజేతలకు.. ఎంపీ భరత్ ప్రత్యేక అభినందనలు

వార్త ముఖ్యాంశాలు

  • **విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి) నవంబర్ 6 ::** జీవీఎంసీ స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేసి ప్రజాభిమానంతో విజయం సాధించిన నూతన కార్పొరేటర్లకు విశాఖపట్నం లోక్‌సభ సభ్యులు శ్రీ మతుకుమిల్లి భరత్ ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేశారు.
  • ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులను అభినందిస్తూ, ప్రజాసేవలో అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
  • ఈ కార్యక్రమానికి జీవీఎంసీ 5వ వార్డు నుంచి కూటమి తరఫున కార్పొరేటర్లుగా విజయం సాధించిన శ్రీమతి చోడిపిల్లి గాయత్రి, CT.

**విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి) నవంబర్ 6 ::**

జీవీఎంసీ స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేసి ప్రజాభిమానంతో విజయం సాధించిన నూతన కార్పొరేటర్లకు విశాఖపట్నం లోక్‌సభ సభ్యులు శ్రీ మతుకుమిల్లి భరత్ ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులను అభినందిస్తూ, ప్రజాసేవలో అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి జీవీఎంసీ 5వ వార్డు నుంచి కూటమి తరఫున కార్పొరేటర్లుగా విజయం సాధించిన శ్రీమతి చోడిపిల్లి గాయత్రి, CT. శంకర్‌లతో పాటు భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు డాక్టర్ పంచకర్ల సందీప్ హాజరయ్యారు.

విశాఖపట్నం ఎంపీ శ్రీ మతుకుమిల్లి భరత్, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం నూతన మేయర్ శ్రీమతి ముక్కా శ్రావణి తదితర కూటమి నాయకులు ఈ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన మేయర్ ముక్కా శ్రావణితో పాటు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లందరికీ ఎంపీ భరత్, డాక్టర్ పంచకర్ల సందీప్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఐదవ వార్డు కార్పొరేటర్లు చోడిపిల్లి గాయత్రి, CT. శంకర్‌లను ప్రత్యేకంగా అభినందించి ఆశీస్సులు అందించారు. ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి, డాక్టర్ పంచకర్ల సందీప్‌తో పాటు కూటమి నాయకుల ఆశీస్సులు అందుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

**ప్రజలు ఇచ్చిన విజయం పదవికి అలంకారం మాత్రమే కాదు.. ప్రజల పట్ల మరింత బాధ్యతను గుర్తుచేసే పవిత్రమైన బాధ్యత!** వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజల సమస్యలకు స్పందిస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

**ప్రజల ఆశీర్వాదంతో విజయం… ప్రజల మన్ననలతోనే నిజమైన నాయకత్వం!**

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *