వార్త ముఖ్యాంశాలు
- ఖానాపురం పున్నమి ప్రతినిధి: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా ఖానాపురం మండల బీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు.
- ఈ సందర్భంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించారు.
- ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.
ఖానాపురం పున్నమి ప్రతినిధి: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా ఖానాపురం మండల బీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామాల వారీగా ఓటరు నమోదు పురోగతిని సమీక్షించి, అర్హులైన పట్టభద్రులందరినీ గుర్తించి నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఓటరు నమోదు ఇన్చార్జీలు, యువజన, మహిళా నాయకులు పాల్గొన్నారు.