వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: SMGR ప్రభుత్వ వ్యవసాయ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో గండిపాలెం, వెంగళరావునగర్ గ్రామాల్లో ప్రత్యేక సేవా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
- ఈ శిబిరాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి.
- గోపికృష్ణ ప్రారంభించారు.
ఉదయగిరి: SMGR ప్రభుత్వ వ్యవసాయ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో గండిపాలెం, వెంగళరావునగర్ గ్రామాల్లో ప్రత్యేక సేవా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి. గోపికృష్ణ ప్రారంభించారు. నవంబర్ 4వ తేదీ వరకు కొనసాగనున్న శిబిరంలో భాగంగా గండిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిసరాల్లో విద్యార్థులు స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడమే శిబిరం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.