వార్త ముఖ్యాంశాలు
- గంగమ్మగుడి, నాగులపుట్ట, పితృ కార్యాలకు వెళ్లే దారిలో ఇబ్బందులు – సిమెంట్ రోడ్డు నిర్మించాలని గ్రామస్థుల విజ్ఞప్తి పున్నమి న్యూస్ – బోగోలు మండలం, రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి బోగోలు: బోగోలు మండల పరిధిలోని గంగమ్మగుడి, నాగులపుట్ట, పితృకార్యాలకు ఉపయోగించే మార్గం బురదమయంగా మారడంతో గ్రామస్థులు, రైతులు తీవ్ర…
- వర్షాలు కురిసిన సమయంలో రహదారి మొత్తం బురదతో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
- దీంతో గ్రామ ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు నిత్యం అవస్థలు పడుతున్నారు.
గంగమ్మగుడి, నాగులపుట్ట, పితృ కార్యాలకు వెళ్లే దారిలో ఇబ్బందులు – సిమెంట్ రోడ్డు నిర్మించాలని గ్రామస్థుల విజ్ఞప్తి
పున్నమి న్యూస్ – బోగోలు మండలం, రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
బోగోలు: బోగోలు మండల పరిధిలోని గంగమ్మగుడి, నాగులపుట్ట, పితృకార్యాలకు ఉపయోగించే మార్గం బురదమయంగా మారడంతో గ్రామస్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన సమయంలో రహదారి మొత్తం బురదతో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో గ్రామ ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు నిత్యం అవస్థలు పడుతున్నారు.
ఈ మార్గం గంగమ్మగుడికి, నాగులపుట్టకు, పితృకార్యాలు నిర్వహించే ప్రాంతానికి వెళ్లేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు, వ్యవసాయ పనులు చేసుకునేందుకు ఈ దారిపైనే ఆధారపడుతున్నారు. అయితే రహదారి సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో నడవడానికి కూడా ఇబ్బందికరంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా గంగమ్మగుడి, నాగులపుట్టతో పాటు శివాలయం–శ్రీ చెన్నకేశవాలయానికి వెళ్లే భక్తులు కూడా రహదారి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని, ప్రజలకు కనీస రవాణా సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కొత్త పాలకవర్గంపై గ్రామస్థుల ఆశలు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టే ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చే హామీల్లో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు, నూతన ప్రజాప్రతినిధులు స్పందించి ఈ మార్గంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. రహదారి నిర్మాణం పూర్తయితే భక్తులకు, రైతులకు, గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.