संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఫౌండర్ డైరెక్టర్ కన్నుమూత

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఫౌండర్ డైరెక్టర్ కన్నుమూత

खबर की मुख्य बातें

  • డా.
  • ఏ.
  • రాజా రెడ్డి (88) మృతి..

డా. ఏ. రాజా రెడ్డి (88) మృతి.. కళాశాల వర్గాల సంతాపం

బోగోలు: మండలంలోని కడనూతల గ్రామంలో ఉన్న రామిరెడ్డి సుబ్బారామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఫౌండర్ డైరెక్టర్ డా. ఏ. రాజా రెడ్డి (88) గురువారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.ఎం.వి. రెడ్డి తెలిపారు.

గురువారం సాయంత్రం వరకు చురుకుగా ఉన్న ఆయన ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందడం కళాశాల వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విద్యార్థుల అభ్యున్నతికి, విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి.

ఆయన మృతి పట్ల కళాశాల చైర్మన్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి అదిలక్ష్మి, కళాశాల ఏవో ఆర్. రమణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మాల్యాద్రి రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంత్యక్రియలు: ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన స్వగ్రామమైన వలివేడు గ్రామంలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *