Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఉదయగిరి సీఐ అంకమ్మరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఉదయగిరి సీఐ అంకమ్మరావు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఉదయగిరి సీఐ అంకమ్మరావు కోరారు.
  • ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
  • ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఉదయగిరి: మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఉదయగిరి సీఐ అంకమ్మరావు కోరారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. శాంతి, భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని సీఐ అంకమ్మరావు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *