Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఖానాపురం మండలంలోని అన్ని గ్రామాల కుల పెద్ద మనుషులకు ధన్యవాదాలు.. బత్తిని శ్రీనివాస్ గౌడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖానాపురం మండలంలోని అన్ని గ్రామాల కుల పెద్ద మనుషులకు ధన్యవాదాలు.. బత్తిని శ్రీనివాస్ గౌడ్

దసరా మరియు బతుకమ్మఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో భాగంగా తమ కర్తవ్యాలను బాధ్యతలను సంపూర్ణంగా పాటించి వారి వారి స్తోమతకు తగ్గట్టుగా డబ్బులు చందాల రూపకంగా కేటాయించి పండుగల నిర్వహణకు పాటుబడిన నియోజకవర్గంలోని అన్ని గ్రామాల యొక్క ప్రతి ఒక్క కుల పెద్దమనిషికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం
ముఖ్యంగా మన గ్రామాలలో గ్రామ దేవత అయిన బొడ్రాయి వద్ద పూజలు దసరా పండుగ ఉత్సవాలు నిర్వహించడంలో కుల పెద్ద మనుషుల పాత్ర హర్షనీయమైనది బాధ్యతాయుతమైనది
ఎల్ నినో ప్రభావం వల్ల కరువు ఆవరించిన వేల మన ప్రాంతంపై ఆ దేవతల ఆశీస్సులు ఉండాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వినాయక మరియు దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసి నవరాత్రులు పూజించి మన ప్రాంత ఐకమత్యాన్ని చాటారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఉన్నా లేకున్నా మన ప్రాంత ప్రజల పట్ల వారికున్న బాధ్యతతో అన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడంలో భాగస్వామ్యులైనటువంటి ప్రతి గ్రామ ప్రజాప్రతినిధులకు మరియు ప్రతి శాఖ అధికారులకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం
ఎల్ నినొ తెచ్చిన కరువు వల్ల మనకు ఎదురవబోయే ఎటువంటి క్లిష్ట పరిస్థితులను అయినా మనమందరం ఐకమత్యంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని మనకు ఉన్నటువంటి వనరులను (తాగునీరు సాగునీరు కరెంటు ఆహార పదార్థాలు ) సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవాలని ఆ దేవతల ఆశీర్వాదం మన మీద మన ప్రాంతం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ పిల్ల దసరా శుభాకాంక్షలు.

ఖానాపురం మండలంలోని అన్ని గ్రామాల కుల పెద్ద మనుషులకు ధన్యవాదాలు.. బత్తిని శ్రీనివాస్ గౌడ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *