నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ సూటి ప్రశ్న..
మీరు ప్రకటించిన రెండున్నర లక్షల (2.5)పెన్షన్ల మంజూరు ఎక్కడ ఎప్పుడు,ఆగస్టు 15 కు మంజూరు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మళ్లీ వాయిదా వేస్తూ దసరాకి ఇస్తామని కౌన్సిల్ సాక్షిగా చెప్పారు అబద్ధపు ప్రకటనలలో మంత్రి సీతక్క కూడా పాలుపంచుకున్నారు.
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వీరందరినీ కూడా ఉచ్చ నీచాలు మరిచి అబద్దాలతో మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
దసరాకు 2.5 లక్షల పెన్షన్ల మంజూరు ఇస్తామని ప్రకటించారు కదా మరి దసరా కానుకగా లబ్ధిదారుల లిస్టు ప్రకటించారా? లేదా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారా? లేక లబ్ధిదారుల ఎకౌంటులలో ఈ నెల పెన్షన్ డబ్బులు జమ చేశారా? ఏం చేశారు
బతుకమ్మ దుర్గమ్మల సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి శాపనార్ధాలు పెడుతున్న తెలంగాణ ప్రజానీకం.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన 420 హామీలలో అతి ముఖ్యమైనది పెన్షన్స్ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పెన్షన్లను రెండింతలు చేస్తామని ప్రతి సంవత్సరం అర్హులను ఎంపిక చేసి కొత్త పెన్షన్లను మంజూరు ఇస్తామని హామీలు ఇచ్చారు ప్రమాణాలు చేశారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజులలోపే హామీలు నెరవేరుస్తామని చెప్పారు అదంతా బూటకమని మేము చేతగాని వారమని మళ్లీ మీరే రుజువు చేసుకున్నారు నాటక మండలి వారిని మించి నాటకాలు వేశారు వాయిదాలు వేశారు అబద్ధాలు ఆడారు మూడు సంవత్సరాలు గడిపారు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు ఆసరా పెన్షన్ పథకాన్ని మాత్రం చేయూతగా పేరు మార్చారు తప్ప ఆ పథకానికి చేయూతనిచ్చింది ఏమీ లేదు ఒక్క కొత్త లబ్ధిదారునికి కూడా మంజూరు ఇచ్చింది లేదు పెన్షన్ డబల్ చేసింది లేదు,పలుమార్లు అప్లికేషన్స్ పెట్టుకోమన్నారు పెన్షన్ కు అర్హులైన వారు అర్జీపెడుతూనే ఉన్నారు అలా మూడు సంవత్సరాలు గడిపారు
సరే ఈ సంవత్సరం ఆగస్టు 15 కు రెండున్నర లక్షల మందికి పెన్షన్స్ మంజూరు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు మాట ఇచ్చారు.
