కాకినాడ, అక్టోబరు17: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాకినాడలో కూటమి నేతలు సమావేశమై ఎన్నికలపై చర్చించారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల కాకినాడ జిల్లా బీజేపీ పరిశీలకుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.
