Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

రెబ్బెనలో ధమ్మ చక్ర పరివర్తన దివస్‌కు కరపత్రం విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెబ్బెనలో ధమ్మ చక్ర పరివర్తన దివస్‌కు కరపత్రం విడుదల

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
అక్టోబర్ 29న మండలంలోని బౌద్ధులు, అంబేద్కర్‌వాదులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి

పున్నమి ప్రతినిధి | రెబ్బెన | తేదీ: 18-10-2026

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో ధమ్మ చక్ర పరివర్తన దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సెంటర్ కమిటీ, లుంబిని దీక్ష భూమి ఆసిఫాబాద్ నాయకత్వంలో ఆదివారం కరపత్రాన్ని విడుదల చేశారు.

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న ధమ్మ చక్ర పరివర్తన దివస్ కార్యక్రమానికి రెబ్బెన మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బౌద్ధులు, అంబేద్కర్‌వాదులు ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు చొప్పున బయలుదేరి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మండల ప్రజలు సహకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

అంబేద్కర్ బోధించిన సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావం, మానవతా విలువలను ప్రజల్లో మరింతగా విస్తరించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

రెబ్బెనలో ధమ్మ చక్ర పరివర్తన దివస్‌కు కరపత్రం విడుదల

Leave a comment

Your email address will not be published. Required fields are marked *