వార్త ముఖ్యాంశాలు
- వార్డు మెంబర్ గా మాజీ సర్పంచ్ సోమిశెట్టి పోటీ- పామూరు: మార్కాపురం జిల్లా, కనిగిరి నియోజకవర్గంలోని పామూరు గ్రామపంచాయతీ 9వ వార్డు సభ్యుడిగా మాజీ సర్పంచి సోమిశెట్టి నారాయణ పోటీ చేస్తున్నారు.
- ఆయన తండ్రి కూడా గతంలో సర్పంచిగా పనిచేసి గ్రామ ప్రజలకు సేవలందించారు.
- తండ్రి మరణానంతరం సోమిశెట్టి నారాయణ సైతం సర్పంచిగా బాధ్యతలు నిర్వహించారు.
వార్డు మెంబర్ గా మాజీ సర్పంచ్ సోమిశెట్టి పోటీ-
పామూరు: మార్కాపురం జిల్లా, కనిగిరి నియోజకవర్గంలోని పామూరు గ్రామపంచాయతీ 9వ వార్డు సభ్యుడిగా మాజీ సర్పంచి సోమిశెట్టి నారాయణ పోటీ చేస్తున్నారు. ఆయన తండ్రి కూడా గతంలో సర్పంచిగా పనిచేసి గ్రామ ప్రజలకు సేవలందించారు. తండ్రి మరణానంతరం సోమిశెట్టి నారాయణ సైతం సర్పంచిగా బాధ్యతలు నిర్వహించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో సర్పంచిగా పనిచేసిన అనుభవంతో వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సోమిశెట్టి నారాయణ తెలిపారు. 9వ వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొంటూ, వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.