Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

నారాయణపూర్‌లో యువకుడి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నారాయణపూర్‌లో యువకుడి మృతి

గ్రామ సమీపంలోని బావిలో లభ్యమైన పల్లె సాయికిరణ్ మృతదేహం

ఘటనా స్థలాన్ని పరిశీలించిన రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ

పున్నమి న్యూస్ | అక్టోబర్ 13, 2026

రెబ్బెన: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లె రామయ్య కుమారుడు పల్లె సాయికిరణ్ మృతి చెందాడు. గ్రామ సమీపంలోని బావిలో ఆయన మృతదేహం లభ్యమైంది.

యువకుడి మృతదేహం బావిలో ఉన్నట్లు సమాచారం అందుకున్న రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.

అయితే సాయికిరణ్ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. యువకుడి మృతితో నారాయణపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నారాయణపూర్‌లో యువకుడి మృతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *