Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

వార్త ముఖ్యాంశాలు

  • పుల్లంపేట,: గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రైల్వేకోడూరు నియోజకవర్గ అధ్యక్షులు మాదరాజు గంగాధర్, ప్రధాన కార్యదర్శి దాసరి జయచంద్ర, ఉపాధ్యక్షులు నంద్యాల సరోజనమ్మ డిమాండ్ చేశారు.పుల్లంపేటలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు కె.
  • శంకరయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.
  • ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..

పుల్లంపేట,: గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రైల్వేకోడూరు నియోజకవర్గ అధ్యక్షులు మాదరాజు గంగాధర్, ప్రధాన కార్యదర్శి దాసరి జయచంద్ర, ఉపాధ్యక్షులు నంద్యాల సరోజనమ్మ డిమాండ్ చేశారు.పుల్లంపేటలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు కె. శంకరయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తక్కువ వేతనాలతో రేయింబవళ్లు పనిచేస్తూ గ్రామాల పరిశుభ్రతకు కృషి చేస్తున్న కార్మికులకు కనీస వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత వంటి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. డీపీఓ సంతకంతో గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, పనిముట్లు, యూనిఫాం, భద్రతా పరికరాలు అందించాలని కోరారు. జనాభా, గ్రామాల విస్తరణకు అనుగుణంగా పంచాయతీ కార్మికుల సంఖ్యను పెంచాలని తెలిపారు.ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.నూతన కమిటీ: అధ్యక్షురాలిగా ఎం. గుర్రమ్మ, కార్యదర్శిగా కె. శంకరయ్య, కోశాధికారిగా బి. గురయ్య, ఉపాధ్యక్షులుగా సుబ్బరాయుడు, శంకర, శివయ్య, సహాయ కార్యదర్శులుగా నర్సింహులు, రమణయ్య, జయన్న ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, ఏఐటీయూసీ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *