వార్త ముఖ్యాంశాలు
- బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు.
- ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 28వ ప్యాకేజీ త్వరగా మంజూరై పనులు పూర్తికావాలని కోరుతూ సంబంధిత పత్రాలను అమ్మవారి పాదాల చెంత సమర్పించారు.
- 28వ ప్యాకేజీ పూర్తయితే గోదావరి జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వినియోగించి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పంట పొలాలకు సాగునీరు అందించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 28వ ప్యాకేజీ త్వరగా మంజూరై పనులు పూర్తికావాలని కోరుతూ సంబంధిత పత్రాలను అమ్మవారి పాదాల చెంత సమర్పించారు. 28వ ప్యాకేజీ పూర్తయితే గోదావరి జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వినియోగించి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పంట పొలాలకు సాగునీరు అందించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్యాకేజీ పనుల కోసం రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయడమే లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి జలాలు ప్రతి గ్రామానికి చేరి రైతుల పొలాలు సస్యశ్యామలం కావాలని, రైతుల జీవితాల్లో సంతోషం నిండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.