Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

జి కొండూరు మండలం కవులూరు 35 లక్షలతో నూతన పశువులు ఆసుపత్రి భవనం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జి కొండూరు మండలం కవులూరు 35 లక్షలతో నూతన పశువులు ఆసుపత్రి భవనం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

పశుసంపద పరిరక్షణకు భరోసా.. పశువైద్య సేవలకు కొత్త బాట!

కవులూరులో రూ.35 లక్షలతో నూతన పశువుల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం.

పశుపోషకుల సంక్షేమం, పశుసంపద అభివృద్ధే లక్ష్యం.

-మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, అక్టోబర్ 10:

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న పశుసంపద పరిరక్షణతో పాటు పశుపోషకులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు.

పశువైద్య సేవలను గ్రామీణ ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో డి.ఎం.ఎఫ్ నిధులు రూ.35 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన పశువుల ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆయన శనివారం రాత్రి శంకుస్థాపన చేశారు.

పశుపోషకులకు మెరుగైన వైద్య సేవలు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పశువుల పెంపకం అనేక కుటుంబాలకు ప్రధాన జీవనాధారంగా ఉందన్నారు. పశువులకు సకాలంలో వైద్య చికిత్స అందించడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పశుపోషకుల ఆదాయానికి భరోసా కల్పించవచ్చని తెలిపారు. పశువైద్య సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా పశుపోషకులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఐటీడీపీ అధ్యక్షుడికి జన్మదిన శుభాకాంక్షలు.

అనంతరం మైలవరం నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు నక్కనబోయిన దుర్గా జగదీష్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు. ఆయనకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ.

కవులూరు సొసైటీ మాజీ అధ్యక్షుడు తాటికొండ భాస్కరరావు సోదరుడు శ్రీహరి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, శ్రీహరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

బాలుడికి ఆప్యాయ పలకరింపు.

ఇటీవల బస్సు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న పవన్ కుమారుడు డింపుల్ హర్షవర్ధన్‌ను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని తిరిగి పాఠశాలకు వెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాల్లో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

జి కొండూరు మండలం కవులూరు 35 లక్షలతో నూతన పశువులు ఆసుపత్రి భవనం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

జి కొండూరు మండలం కవులూరు 35 లక్షలతో నూతన పశువులు ఆసుపత్రి భవనం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *