Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

మగ్దుమ్ బాబా దర్గా ఉరుసుకు పోలీసు అధికారులకు ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మగ్దుమ్ బాబా దర్గా ఉరుసుకు పోలీసు అధికారులకు ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • నందలూరు, మండలంలోని ప్రసిద్ధ మగ్దుమ్ బాబా దర్గా ఉరుసు మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ దర్గా చిన్న పీఠాధిపతి గురువులయ్య సయ్యద్ హైదర్ సాహెబ్ ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, నందలూరు ఎస్సై మల్లికార్జున్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉరుసు…
  • ఎస్సై మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
  • భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, ఆధ్యాత్మిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

నందలూరు, మండలంలోని ప్రసిద్ధ మగ్దుమ్ బాబా దర్గా ఉరుసు మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ దర్గా చిన్న పీఠాధిపతి గురువులయ్య సయ్యద్ హైదర్ సాహెబ్ ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, నందలూరు ఎస్సై మల్లికార్జున్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉరుసు మహోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణకు, భక్తుల సౌకర్యాలకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్సై మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, ఆధ్యాత్మిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *