వార్త ముఖ్యాంశాలు
- సీతారాంపురంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం సీతారాంపురం: మండలంలోని సీతారాంపురం బిట్–2 ఆర్‌సీఎం చర్చి గ్రౌండ్‌లో మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించారు.
- ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ చింతం రెడ్డి పద్మావతి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చింతం రెడ్డి సుబ్బారెడ్డితో కలిసి రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు.
- ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని తెలిపారు.
సీతారాంపురంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
సీతారాంపురం: మండలంలోని సీతారాంపురం బిట్–2 ఆర్‌సీఎం చర్చి గ్రౌండ్‌లో మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ చింతం రెడ్డి పద్మావతి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చింతం రెడ్డి సుబ్బారెడ్డితో కలిసి రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని తెలిపారు. యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అల్లూరు రాజు, పిడతల పద్మావతి, రామిశెట్టి తిరుపతయ్య, బాలినేని మాబయ్య, పిడతల ఓబులేసు, చింతబోయిన దుర్గయ్య, కనుమర్లపూడి పవన్, కలివెల సతీష్‌కుమార్‌తో పాటు పలువురు నాయకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.