Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పామూరు అభివృద్ధికి నిధులు కేటాయించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పామూరు అభివృద్ధికి నిధులు కేటాయించాలి

మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ సర్పంచి సోమిశెట్టి నారాయణ

పామూరు: పామూరు గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడంతోపాటు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పామూరు మాజీ సర్పంచి సోమిశెట్టి నారాయణ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రం అందజేశారు. పామూరు గ్రామంలో కూరగాయల మార్కెట్‌కు మూడు అంతస్తుల భవనం నిర్మించాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్‌కు సొంత భవనం అందుబాటులోకి వస్తే కూరగాయల వ్యాపారులకు, రైతులకు, వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు. అదేవిధంగా ఎర్రజెర్లలో 490 ఇళ్లకు సంబంధించి ఎండోమెంట్స్‌ శాఖ నుంచి అవసరమైన క్లియరెన్స్‌ ఇప్పించి, లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లకు సంబంధించిన సమస్య పరిష్కారమైతే ఎన్నో కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఈ రెండు ప్రధాన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పామూరు ప్రాంత అభివృద్ధితోపాటు, ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి మంత్రి చొరవ తీసుకోవాలని సోమిశెట్టి నారాయణ విజ్ఞప్తి చేశారు.

పామూరు అభివృద్ధికి నిధులు కేటాయించాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *