Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ముద్దుల పర్వ రెడ్డి గూడెం మండలం సి సి రోడ్డు శంకుస్థాపన ఎమ్మెల్యే వసంత వెంకట వసంత వెంకట కృష్ణ ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముద్దుల పర్వ రెడ్డి గూడెం మండలం సి సి రోడ్డు శంకుస్థాపన ఎమ్మెల్యే వసంత వెంకట వసంత వెంకట కృష్ణ ప్రసాద్

వీబీ-జీ రామ్‌జీ నిధులతో గ్రామీణ మౌలిక వసతుల బలోపేతం.

మద్దులపర్వ పంచాయతీ పరిధిలో రూ.75 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.

-మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, అక్టోబర్ 9:

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతోందని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

రెడ్డిగూడెం మండలంలోని మద్దులపర్వ పంచాయతీ పరిధిలో వీబీ-జీ రామ్‌జీ నిధుల ద్వారా రూ.75 లక్షల వ్యయంతో చేపట్టనున్న 1150 మీటర్ల పొడవైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శుక్రవారం శంకుస్థాపన చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రజల రోజువారీ రాకపోకలకు ఎంతో దోహదపడుతుందని, అంతర్గత రహదారులు మెరుగుపడటం వల్ల రవాణా సౌకర్యాలు మరింత సులభతరమవుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు.

ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేస్తూ, చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా అవసరాల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు.

తొలుత అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. అనంతరం తాగునీటి బోరును ప్రారంభించారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కుటుంబ సభ్యులు తీగల అప్పయ్య గారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

#

ముద్దుల పర్వ రెడ్డి గూడెం మండలం సి సి రోడ్డు శంకుస్థాపన ఎమ్మెల్యే వసంత వెంకట వసంత వెంకట కృష్ణ ప్రసాద్

ముద్దుల పర్వ రెడ్డి గూడెం మండలం సి సి రోడ్డు శంకుస్థాపన ఎమ్మెల్యే వసంత వెంకట వసంత వెంకట కృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *