Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా కావలిలో జనసేనకు కొత్త ఊపు సైలెంట్ గా ఉన్న పవన్ లు మళ్లీ యాక్టివ్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు జిల్లా కావలిలో జనసేనకు కొత్త ఊపు సైలెంట్ గా ఉన్న పవన్ లు మళ్లీ యాక్టివ్.

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జనసేన రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న పలువురు పవన్ అభిమానులు ఇప్పుడు మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నారు.

పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు సాధనాల మణికంఠ, మాజీ వెంకయ్యలు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన నాయకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి పార్టీలోకి రావడంతో స్థానికంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని చర్చ జరుగుతోంది.

సుకుమార్ రెడ్డి నాయకత్వ పటిమ, ప్రజల్లోకి వెళ్లే తీరు, రాజకీయ వ్యవహారాల్లో చురుకుదనం తమను ఆకర్షించాయని మణికంఠ, వెంకయ్యలు పేర్కొన్నట్లు సమాచారం. ఆయనకు మద్దతుగా నిలుస్తూ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

సుకుమార్ రెడ్డి నాయకత్వంతో జనసేన మరింత బలోపేతం అవుతుందని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా, చాలాకాలంగా క్రియాశీలకంగా లేని పవన్ అభిమానులు మళ్లీ యాక్టివ్ కావడం కావలి ప్రాంత జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సుకుమార్ రెడ్డి రాకతో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని స్థానికులు అంటున్నారు.

నెల్లూరు జిల్లా కావలిలో జనసేనకు కొత్త ఊపు సైలెంట్ గా ఉన్న పవన్ లు మళ్లీ యాక్టివ్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *