వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు అక్టోబర్ 9-2026(ఉస్మాన్ పున్నమి ప్రతినిధి ) నందిపాడు: దుత్తలూరు మండల బీజేపీ నాయకుల సమావేశం నందిపాడులో నిర్వహించారు.
- మండల కన్వీనర్ లెక్కల వెంగళరెడ్డి ఆదేశాల మేరకు బీజేవైఎం మండల అధ్యక్షుడు పెమ్మసాని వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
- ఈ సమావేశానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు హరిగోపాల్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, మండల ప్రధాన కార్యదర్శి పెసలా కృష్ణ, తదితరులు హాజరయ్యారు.
దుత్తలూరు
అక్టోబర్ 9-2026(ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )
నందిపాడు: దుత్తలూరు మండల బీజేపీ నాయకుల సమావేశం నందిపాడులో నిర్వహించారు. మండల కన్వీనర్ లెక్కల వెంగళరెడ్డి ఆదేశాల మేరకు బీజేవైఎం మండల అధ్యక్షుడు పెమ్మసాని వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు హరిగోపాల్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, మండల ప్రధాన కార్యదర్శి పెసలా కృష్ణ, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండలంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగడంపై చర్చించినట్లు సమాచారం. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాబోయే స్టానిక సంస్థ ల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు గెలుపుకు నాయకులు కృషి చేయాలని సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది.
సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.