వార్త ముఖ్యాంశాలు
- నర్రవాడ వేంగమాంబ ఆలయంలో వరుణ యాగం..
- పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నర్రవా డ: సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వేంగమాంబ పేరంటాలమ్మ దేవస్థానంలో మంగళవారం వరుణ యాగం నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
నర్రవాడ వేంగమాంబ ఆలయంలో వరుణ యాగం.. పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నర్రవా డ: సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వేంగమాంబ పేరంటాలమ్మ దేవస్థానంలో మంగళవారం వరుణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రకృతి అనుకూలించి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, జలవనరులు నిండాలని, రైతాంగానికి మేలు జరగాలని ప్రార్థించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. వేద పండితుల ఆధ్వర్యంలో యాగం భక్తిశ్రద్ధలతో సాగింది. అనంతరం పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, వేద పండితులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.