వార్త ముఖ్యాంశాలు
- గుర్రంకొండ: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలోని శ్రీ రెడ్డెమ్మ దేవత ఆలయంలో దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
- అక్టోబరు 11వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ మంగళవారం వరకు పది రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు.
- ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
గుర్రంకొండ: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలోని శ్రీ రెడ్డెమ్మ దేవత ఆలయంలో దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబరు 11వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ మంగళవారం వరకు పది రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం పంచామృత అభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో గ్రామ పురోహితుడు శివరామకృష్ణ శర్మచే సామూహిక కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. ఉభయదారుల సహకారంతో ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ లంకిపల్లి రాజన్న నాయుడు, కార్యనిర్వహణాధికారి మంజుల తెలిపారు. దసరా ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.