పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కళ్యాణ లక్ష్మి గార్డెన్ లో పోషణ మాసం 2026 ముగింపు వేడుకలు నిర్వహించారు మన అంగన్వాడి మన బాధ్యత జిల్లా మహిళా శ్రీ సంక్షేమ దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మన అంగన్వాడి మన బాధ్యత కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిన్నారుల ఆరోగ్యం పోషణ విద్యాభివృద్ధిలో అంగన్వాడీల పాత్ర కీలకమని ఆమె అన్నారు అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక వసతులు పరిశుభ్రత తాగునీరు విద్యపై ఏఎంసి కమిటీలు ప్రత్యేక దృష్టి దారించాలని సూచించారు అనంతరం సామూహిక శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణీలను ఆశీర్వదించారు కార్యక్రమంలో కౌన్సిలర్ అధికారులు అంగన్వాడి సిబ్బంది ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు ప్రజాప్రతినిధు లు పాల్గొన్నారు
