Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు సౌకర్యాలు, భద్రతపై అధికారుల ప్రత్యేక దృష్టి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు సౌకర్యాలు, భద్రతపై అధికారుల ప్రత్యేక దృష్టి

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల : ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నంద్యాల పట్టణంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
  • ఇందులో భాగంగా పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ బి.
  • శేషన్న, అదనపు ఎస్పీ ఆర్.

నంద్యాల : ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నంద్యాల పట్టణంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న, అదనపు ఎస్పీ ఆర్. సుస్మిత బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలను సమగ్రంగా తనిఖీ చేశారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని అధికారులు సూచించారు. ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన అన్ని మౌలిక వసతులను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, రహదారి సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులు స్పష్టం చేశారు.ఎన్నికల ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా ముందస్తుగానే గుర్తించి పరిష్కరించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.ఈ తనిఖీల్లో ఎంఈ నాగభూషణం రెడ్డి, డీఈలు పవన్ కుమార్, రసూల్ ఆజాద్, టౌన్ ప్లానింగ్ అధికారి నరసింహమూర్తి, రెజ్వాన్, మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పాల్గొనారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *