వార్త ముఖ్యాంశాలు
- విజయవాడలో జరగనున్న దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు ఆహ్వానించేందుకు ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు ,రాజ్యసభ ఎంపీ సనా సతీష్ బాబుతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను గురువారం న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి సాదరంగా ఆహ్వానించడం జరిగిందని…
విజయవాడలో జరగనున్న దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు ఆహ్వానించేందుకు ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు ,రాజ్యసభ ఎంపీ సనా సతీష్ బాబుతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను గురువారం న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి సాదరంగా ఆహ్వానించడం జరిగిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులతో విజయవాడ దసరా ఉత్సవాలు వైభవంగా జరగాలని ఆకాంక్షిస్తున్నామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.