Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

గంగమ్మ ఆలయంలో తొలిసారిగా వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గంగమ్మ ఆలయంలో తొలిసారిగా వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

వార్త ముఖ్యాంశాలు

  • గంగమ్మ ఆలయంలో తొలిసారిగా వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు పలమనేరు, అక్టోబర్ 07 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు పట్టణంలో కొలువైన ప్రసిద్ధ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో మొట్టమొదటిసారిగా దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
  • దసరా పండుగను పురస్కరించుకుని తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
  • ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి దుర్గాదేవి విగ్రహాన్ని తెప్పించడం విశేషం.

గంగమ్మ ఆలయంలో తొలిసారిగా వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

పలమనేరు, అక్టోబర్ 07 ( పున్నమి ప్రతినిధి ) :
పలమనేరు పట్టణంలో కొలువైన ప్రసిద్ధ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో మొట్టమొదటిసారిగా దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి దుర్గాదేవి విగ్రహాన్ని తెప్పించడం విశేషం. ఈ నవరాత్రి ఉత్సవాల్లో దుర్గా దేవి ప్రతిరోజూ ఒక ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం నుంచే అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆలయంలో ఈ నవరాత్రులు నిర్వహించనున్నారు.
ఉత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తొమ్మిది రోజుల పాటు దర్శనానికి వచ్చే భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం అందించనున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…
మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ దేవీ నవరాత్రోత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని, దుర్గాదేవి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కుట్టి, గిరిబాబు, గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్, శివాలయం చైర్మన్ మురళీకృష్ణ, అరుణ్ కుమార్, కోటేశ్వర్లు, నాగరాజు, మదన్, సుబ్రహ్మణ్యం, హరీష్, యువరాజ్, మూర్తి, మురళీ, విజయ్ శేఖర్, బాబు, రాజేష్ గంగమ్మ గుడి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *