వార్త ముఖ్యాంశాలు
- గాజువాక,(పున్నమి ప్రతినిధి), సెప్టెంబర్ 06 రానున్న జీవీఎంసీ స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని గాజువాక నియోజకవర్గ పరిశీలకులు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.75వ వార్డు నెల్లిముక్కు పులి భూలోక రెడ్డి జీవీఎంసీ…
- కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు వివరించి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల సంక్షేమం కోసం యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.
గాజువాక,(పున్నమి ప్రతినిధి), సెప్టెంబర్ 06
రానున్న జీవీఎంసీ స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని గాజువాక నియోజకవర్గ పరిశీలకులు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.75వ వార్డు నెల్లిముక్కు పులి భూలోక రెడ్డి జీవీఎంసీ కళ్యాణ మండపంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు వివరించి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల సంక్షేమం కోసం యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. నాయకులను స్ఫూర్తిగా తీసుకుని స్థానిక నాయకులు తమ పరిధిలోని కార్యకర్తలను గుర్తించి గౌరవిస్తూ వారికి అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మొల్లి పెంటి రాజు, 75వ వార్డు టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు నమ్మి అప్పారావు, ములకలపల్లి పెంటయ్య, క్లస్టర్ ఇన్చార్జి ఊరుకుటి అప్పలరాజు తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.