Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

*స్టీల్ యాజమాన్యం దసరాకు ముందే SAIL కార్మికులకు ఇచ్చిన విధంగా బోనస్ చెల్లించాలి మరియు VRS పెట్టిన కార్మికుల పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలి – బొండా యల్లాజీరావు, DSEU జనరల్ సెక్రటరీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
*స్టీల్ యాజమాన్యం దసరాకు ముందే SAIL కార్మికులకు ఇచ్చిన విధంగా బోనస్ చెల్లించాలి మరియు VRS పెట్టిన కార్మికుల పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలి – బొండా యల్లాజీరావు, DSEU జనరల్ సెక్రటరీ

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖ ఉక్కు కార్మికులు సమయానికి జీతాలు లేకపోయినా, ఎటువంటి సౌకర్యాలకు నోచుకోకపోయినా, సరైన భోజనం, క్యాంటీన్లు లేకపోయినా, ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోయినా, అదే విధంగా సేఫ్టీ పరికరాలు లేకపోయినా, కార్మికుల సంఖ్య మూడు రెట్లు తగ్గిపోయినా "దినదినగండం - నూరేళ్ల ఆయుషు" అనే చందంగా చెమటోడ్చి కష్టపడి…
  • కనీసం దసరా పండుగ ముందైనా SAIL కార్మికులకు ఇస్తున్న విధంగా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
  • అదే విధంగా VRS తీసుకున్న కార్మికులకు బకాయి సొమ్మును వెంటనే చెల్లించాలని కోరారు.

విశాఖ ఉక్కు కార్మికులు సమయానికి జీతాలు లేకపోయినా, ఎటువంటి సౌకర్యాలకు నోచుకోకపోయినా, సరైన భోజనం, క్యాంటీన్లు లేకపోయినా, ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోయినా, అదే విధంగా సేఫ్టీ పరికరాలు లేకపోయినా, కార్మికుల సంఖ్య మూడు రెట్లు తగ్గిపోయినా “దినదినగండం – నూరేళ్ల ఆయుషు” అనే చందంగా చెమటోడ్చి కష్టపడి ఉత్పత్తి, ఉత్పాదకతలో రికార్డులు సృష్టిస్తున్న స్టీల్ కార్మికులకు యాజమాన్యం తీరని అన్యాయం చేస్తోందని DSEU జనరల్ సెక్రటరీ బొండా యల్లాజీరావు అన్నారు.

కనీసం దసరా పండుగ ముందైనా SAIL కార్మికులకు ఇస్తున్న విధంగా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా VRS తీసుకున్న కార్మికులకు బకాయి సొమ్మును వెంటనే చెల్లించాలని కోరారు.

కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా యాజమాన్యం చర్యలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చి కార్మికుల మనోభావాలను కాపాడి, ప్లాంట్ పురోభివృద్ధికి చర్యలు చేపట్టాలని అన్నారు. లేకుంటే జరిగే పరిణామాలకు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

*- బొండా యల్లాజీరావు*
*జనరల్ సెక్రటరీ, DSEU*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *