Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

నేడు సేవా జ్యోతి యాత్ర మోదీ ప్రజా సేవకు 25 ఏళ్లు పూర్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేడు సేవా జ్యోతి యాత్ర మోదీ ప్రజా సేవకు 25 ఏళ్లు పూర్తి

గాజువాక, అక్టోబర్‌ 6 (పున్నమి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం గాజువాకలో సేవా జ్యోతి యాత్ర నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్‌ కరణం రెడ్డి నరసింగరావు తెలిపారు. గాజువాక బీజేపీ కార్యాలయంలో యువమోర్చా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జాగారపు శ్రీను అధ్యక్షతన మంగళవారం సమాయత్త సమావేశం జరిగింది.

కేఎన్‌ఆర్‌ మాట్లాడుతూ 2001 అక్టోబర్‌ 7న మోదీ తొలిసారిగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ప్రజా సేవకు శ్రీకారం చుట్టారని తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటలకు పాత గాజువాక కూడలి నుంచి బైక్‌ ర్యాలీ ప్రారంభమై ఎన్‌ఏడీ, సింహాచలం, అరిలోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డు మీదుగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ నూతన భవన నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటుందని చెప్పారు. అక్కడి నుంచి పాదయాత్రగా పీవీ సింధు ఆడిటోరియం వరకు వెళ్లి, ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తారని తెలిపారు.

ప్రతి వార్డు నుంచి కనీసం 20 బైకులతో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రోహిణి, గూటూరు శంకరరావు, సురేష్‌, మహేష్‌, కోసూరు తాతారావు, రమాదేవి, శ్రీను, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు సేవా జ్యోతి యాత్ర మోదీ ప్రజా సేవకు 25 ఏళ్లు పూర్తి

నేడు సేవా జ్యోతి యాత్ర మోదీ ప్రజా సేవకు 25 ఏళ్లు పూర్తి

నేడు సేవా జ్యోతి యాత్ర మోదీ ప్రజా సేవకు 25 ఏళ్లు పూర్తి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *