Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు*

*కురవి, అక్టోబర్ 07:*
కురవి మండలంలోని బంచరాయితండాకు చెందిన పత్రిక విలేకరి దేవన్న గారి తండ్రి బానోత్ సక్రం గారు ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, *మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు,ఈ సందర్భంగా వారి కుటుంబానికి *రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు*

అదే గ్రామానికి చెందిన నునావత్ శ్రీను గారు ఇటీవల ప్రమాదానికి గురై, వైద్యుల సూచన మేరకు కాలు తొలగించాల్సి రావడంతో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న *మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* శ్రీను గారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా *రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు*

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నునావత్ వీరన్న, మాజీ ఎంపీటీసీ వీరు నాయక్, తేజ నాయక్, సేత్య, శరత్, ఐలి నరహరి గౌడ్, బోడ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు

అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *