எங்களை தொடர்புகொள்ள சமீபத்திய செய்திகள்
உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்

Tag: Mahabubabad

మహబూబాబాద్

అనుబత్తుల ఐలయ్య మృతికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నివాళులు

కురవి మండలం మోదుగులగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుబత్తుల ఉపేందర్ తండ్రి అనుబత్తుల ఐలయ్య గారి మృతి పట్ల ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు సంతాపం వ్యక్తం చేశారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఐలయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్, మండల నాయకులు, జిల్లా నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచ్లు, గ్రామ అధ్యక్షులు, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మహబూబాబాద్

మరిపెడ మండల కేంద్రంలో జనరల్ బాడీ సమావేశం

మరిపెడలో జనరల్ బాడీ సమావేశం మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. మరిపెడ మండల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుగులోతు రవి నాయక్, టౌన్ అధ్యక్షులు రామ్ లాల్ నాయక్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్

22-A భూముల రిజిస్ట్రేషన్ లకు షరతులతో అనుమతి

*22-A భూముల రిజిస్ట్రేషన్లకు షరతులతో అనుమతి* *తెలంగాణ ప్రభుత్వం 22-A పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న ఫ్లాట్లు, ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు షరతులతో అనుమతి ఇచ్చింది.* ▪️ చెల్లుబాటు అయ్యే లేఅవుట్/బిల్డింగ్/అపార్ట్‌మెంట్ అనుమతి తప్పనిసరి. *▪️ HMDA/GHMC/CMC/MMC/DTCP లేదా స్థానిక సంస్థ అనుమతి ఉండాలి.* ▪️ చెల్లుబాటు అయ్యే రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్లు సమర్పించాలి. *▪️ కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులు తుది తీర్పులు, ఆదేశాలకు లోబడి ఉంటాయి.* ▪️ వివాదాస్పద ఆస్తులపై అధికారులు పూర్తిస్థాయి పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ▪️ సందేహాలు, అభ్యంతరాల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు.

మహబూబాబాద్

తెలంగాణలో ఆటో చార్జీలు పెంపు

*తెలంగాణలో ఆటో చార్జీల పెంపు* 🔹ఆటోల కనీస చార్జీ ₹20 నుంచి ₹30కి పెంపు 🔹ప్రతి కిలోమీటర్‌కు ₹11 నుంచి ₹14కి పెంపు 🔹డిటెన్షన్ చార్జీ 50 పైసల నుంచి 75 పైసలకు పెంపు 🔹లగేజీ చార్జీ 25 పైసల నుంచి 50 పైసలకు పెంపు 🔹గరిష్ఠ లగేజీ పరిమితి 100 కిలోలుగా కొనసాగింపు *రాత్రి వేళల్లో 1.5 రెట్లు చార్జీ కొనసాగింపు* *మీటర్ల రీసెట్టింగ్‌కు 3 నెలల గడువు విధింపు*

మహబూబాబాద్

CMRF ద్వారా మూడు లక్షల ఎల్ఓసి

పేదల ఆరోగ్యానికి భరోసా.. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.3 లక్షల ఎల్‌ఓసీ మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన అలువాల గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉండగా, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ.3,00,000 విలువైన ఎల్‌ఓసీ మంజూరైంది. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ చొరవతో ఈ ఆర్థిక సహాయం మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు వైద్యపరంగా అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్‌కు గంగమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మహబూబాబాద్

రాత్రి సమయంలో వ్యవసాయ మోటర్లు చోరీ పట్టుబడ్డ నిందితులు

మహబూబాబాద్: సోమవారం రాత్రి 9 సమయం లో బూర్గుపహాడు గ్రామం డోర్నకల్ మండలం మహబూబాద్ జిల్లా దబ్బా శ్రీను రైతు బూర్గుపహాడు నుండి ఎన్నారం పోయే దారిలో నాకు 1 ఒక ఎకరం14 కుంటలు భూమి ఉన్నది ఆ భూమిలో ఒక బావికీ ఉన్నది. త్రీ హెచ్ పి మోటార్ ఉన్నది రాత్రి సమయంలో తొమ్మిది గంటలకు చిలుకోడు గ్రామానికి చెందిన (1)బంక నగేష్ మోటర్ మెకానిక్ (2)ప్రసాద్ వీరిద్దరూ కలిసి మోటారు బావిలో నుండి ఊడబీకి ఎత్తకపోవడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో మేము పొలం దగ్గరికి పోటం వలన ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగినది గతంలో కూడా బూర్గుపహాడ్ లో ఎన్నో మోటర్లు ఎత్తకపోవడం జరిగినది రైతులకు మోటర్లు కాలిపోతే సకాలంలో కాలిపోయిన మోటార్నీ కట్టి నడిపించాల్సిన మెకానిక్ కు ఎక్కడ మోటర్లు ఉన్నాయో చూసుకొని రాత్రి సమయాల్లో మోటర్లు ఎత్తకపోయి అమ్ముకునే మెకానికులు ఈ సమాజంలో ఉన్నంతవరకు రైతు సోదరులు కష్టాలు తప్పవు రాత్రి సమయంలోడోర్నకల్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయగా పోలీస్ వారు మా బావి దగ్గరికి వచ్చి వారిని స్టేషనుకి తీసుకెళ్లడం జరిగినది

మహబూబాబాద్

అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుప్రియ తల్లిదండ్రులను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు

*అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుప్రియ తల్లిదండ్రులను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* *కేటీఆర్ గారితో ఫోన్‌లో మాట్లాడించిన సత్యవతి రాథోడ్ గారు*💥 ■ *మహబూబాబాద్, అక్టోబర్ 06:* అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన దారం సుప్రియ మృతి చెందడం పట్ల *మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ◆ సుప్రియ మృతి విషయం తెలుసుకున్న సత్యవతి రాథోడ్ గారు నేడు ఖమ్మంలో నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, జ్యోతి గారిని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడంతో పాటు, ఈ కష్ట సమయంలో కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ★ అనంతరం *బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో సుప్రియ కుటుంబ సభ్యులను ఫోన్‌లో మాట్లాడించారు,సుప్రియ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ గారు హామీ ఇచ్చారు* ◆ *సుప్రియ మృతి పట్ల కేటీఆర్ గారు, సత్యవతి రాథోడ్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు* ● ఈ కార్యక్రమంలో కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి, బొడ శ్రీను నాయక్, మన్యు ప్యాట్నీ,కౌసల్యాదేవిపల్లి సర్పంచ్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

మహబూబాబాద్

కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

ది.06-10-2026, పెద్ద నాగారం, నరసింహులపేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన చలమల్ల భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి BRS పార్టీ లోకి మన మాజీ MLA *శ్రీ DS రెడ్యానాయక్ గారి* సమక్షం లో చేరినారు అజ్మీర తండా గ్రామపంచాయతీకి చెందిన లూనావత్ లక్ష్మీ గారు బానోత్ వెంకన్న గారు మోహన్ గారు చేరినారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గుజి వీరస్వామి గారు మధుగారు శ్రీకాంత్ గారు కొమ్ము పుల్లయ్య గారు అల్లిపురపు రవీందర్ రెడ్డి గారు లింగారెడ్డి గారు అజ్మీర లింగ నాయక్ గారు గంట రాములు గారు గాడుదుల్ల కొమురెల్లి గారు గంట మహేష్ గారు కొమ్ము మధుగారు బింగి విక్రమ్ గారు రుణావత్ రాములు గారు కొమ్ము వీరభద్రం గారు సతీష్ గారు దుర్గయ్య గారు ఉపేందర్ గారు భాస్కర్ గారు చలమల ఉపేందర్ గారు ప్రభాకర్ గారు లింగమలు గారు వెంకన్నగారు చలమల్ల శ్రీను గారు బానోతు రమేష్ బానోత్ చీమ బానోతు లచ్చు తదితరులు పాల్గొన్నారు

మహబూబాబాద్

నూతన సీసీ రోడ్డు ప్రారంభం

మహబూబాబాద్ పట్టణం నందు ఈరోజు సిగ్నల్ కాలనీ నందు 26వ వార్డు కౌన్సిలర్ & మున్సిపల్ ఫ్లోర్ లీడర్ (బిజెపి) మాలోతు శ్రీదేవి బాలునాయక్ గారి ఆధ్వర్యంలో, మానుకోట శాసనసభ్యులు డా”మురళి నాయక్ గారి సహకారంతో, తేజావత్ దేవా ఇంటి దగ్గర నుండి రూడావత్ బిచ్చు ఇంటి వరకు, నూతనంగా సిసి రోడ్ ను కాంట్రాక్టర్ కోమ్మరాజుల ఆనంద్ గారు వేయడం జరిగింది…. ఈ కార్యక్రమంలో మున్సిపల్ A.E పావని గారు, వర్కింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, చుక్క శ్యాం ప్రసాద్ గారు, అజ్మీర శ్రీకాంత్ గారు, బండి వెంకన్న గారు, పెద్ద బోయిన రవి గారు, యుగేందర్ గారు, బిచ్చు గారు, లచ్చిరాం గారు, బద్రు గారు తదితరులు పాల్గొన్నారు

మహబూబాబాద్

నాణ్యమైన భోజనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

*మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి* *ఎస్ ఎఫ్ ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు* *విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు* *ఎలకలు కొరకడం, నాసిరకం భోజనం, పాము కట్లతో, అంతర్గత విద్యార్థుల గొడవలతో అట్టడుకుతున్న గురుకులాలు* *ఒక వైపు నాసిరకం భోజనంతో,మరోవైపు అపరశుభ్రతతో నిర్లక్ష్యంతో జిల్లా గురుకులాలు* *ప్రశ్నించిన విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రుల పై జులుం ప్రదర్శిస్తున్న గురుకులాల ప్రిన్సిపాల్స్* *వరుస ఘటనలు జరుగుతున్న గురుకులాల మొఖం చూడని జిల్లా ఎమ్మెల్యేలు* *గురుకులాల నిర్వహణ పై జిల్లా ఎమ్మెల్యే లు, అధికారులు, గురుకులాల ప్రిన్సిపాల్స్ తో సమీక్షా నిర్వహించాలి :SFI* *గురుకులాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా ఎమ్మెల్యేలు ఆఫీసులో ముందు ధర్నా నిర్వహిస్తాం*