Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

అధిక బిల్లులపై వార్డు మెంబర్ల నిరసన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అధిక బిల్లులపై వార్డు మెంబర్ల నిరసన

వార్త ముఖ్యాంశాలు

  • *మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం వార్డు మెంబర్లు కళ్లకు నల్ల గుడ్డలు కట్టుకుని, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
  • వార్డు మెంబర్ల శిక్షణ తరగతుల నిర్వహణలో వాస్తవంగా జరిగిన ఖర్చులకు మించి బిల్లులు చెల్లించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన పత్రాలను మీడియా ముందు చూపిస్తూ వారు వివరించారు.* *శిక్షణ తరగతుల్లో స్థానికంగానే వంటలు నిర్వహించి భోజనాలు మాత్రమే అందించారని, సమోసాలు తదితర అల్పాహారాలు తమకు…
  • అశోక హోటల్ నుంచి తీసుకువచ్చిన బిల్స్ పూర్తిగా తప్పు అని మండిపడ్డారు.

*మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం వార్డు మెంబర్లు కళ్లకు నల్ల గుడ్డలు కట్టుకుని, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వార్డు మెంబర్ల శిక్షణ తరగతుల నిర్వహణలో వాస్తవంగా జరిగిన ఖర్చులకు మించి బిల్లులు చెల్లించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన పత్రాలను మీడియా ముందు చూపిస్తూ వారు వివరించారు.*

*శిక్షణ తరగతుల్లో స్థానికంగానే వంటలు నిర్వహించి భోజనాలు మాత్రమే అందించారని, సమోసాలు తదితర అల్పాహారాలు తమకు ఇవ్వలేదని తెలిపారు. అశోక హోటల్ నుంచి తీసుకువచ్చిన బిల్స్ పూర్తిగా తప్పు అని మండిపడ్డారు. అలాగే స్కేలు, పెన్సిళ్లు, పెన్నులు వంటి సామగ్రి కూడా ఎవరికీ అందించలేదని చెప్పారు. అయినప్పటికీ ఆయా వస్తువులకు బిల్లులు ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా పొందిన పత్రాల్లో వెల్లడైందని పేర్కొన్నారు.*

*శిక్షణ తరగతులు జయ్యారం గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించగా, అక్కడ ఇప్పటికే సౌండ్ సిస్టమ్, కుర్చీలు తదితర సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటికి కూడా బిల్లులు చూపించినట్లు పత్రాలను ప్రదర్శించారు. ప్రజాధనానికి సంబంధించిన బిల్లుల విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వార్డు మెంబర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, సర్పంచిగా పోటీ చేసిన అభ్యర్థులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *