Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

గంటావురు బీసీ కాలనీలో వైభవంగా గంగమ్మ పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గంటావురు బీసీ కాలనీలో వైభవంగా గంగమ్మ పూజలు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

గంటావురు బీసీ కాలనీలో వైభవంగా గంగమ్మ పూజలు

పలమనేరు, అక్టోబర్ 06 ( పున్నమి ప్రతినిధి ) :

పలమనేరు మున్సిపల్ పరిది లోని గంటాఊరు బీసీ కాలనీలోని గంగమ్మ తల్లి ఆలయంలో మంగళవారం సాయం త్రం ఆధ్యాత్మిక సందడి నెలకొoది. చైర్మన్ సేవరత్న డాక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ సేవరత్న డాక్టర్ మురుగన్ నేతృత్వంలో అమ్మవారికి అభిషేకాలు, అలంకరణలు మరియు ప్రత్యేక మంగళ హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, వర్షాలు పడి పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాలనీ వాసులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రముఖులు, యువకులు మరియు అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని గంగమ్మ తల్లి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *