Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హెల్త్ టిప్స్

భోజనం తర్వాత టీ, కాఫీ తాగడానికి ఎందుకు విరామం ఇవ్వాలి?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భోజనం తర్వాత టీ, కాఫీ తాగడానికి ఎందుకు విరామం ఇవ్వాలి?

వార్త ముఖ్యాంశాలు

  • భోజనం చేసిన వెంటనే వేడి వేడిగా టీ గానీ, కాఫీ గానీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది.
  • ఈ అలవాటు వల్ల మనం తిన్న ఆహారం నుంచి శరీరానికి అందవలసిన ఇనుము (Iron) పరిమాణం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది.
  • తిన్న వెంటనే టీ తాగినప్పుడు ఆహారంలోని ఐరన్ శోషణ 60% నుండి 80% వరకు, కాఫీ తాగినప్పుడు 30% నుండి 50% వరకు పడిపోతుంది.

భోజనం చేసిన వెంటనే వేడి వేడిగా టీ గానీ, కాఫీ గానీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ అలవాటు వల్ల మనం తిన్న ఆహారం నుంచి శరీరానికి అందవలసిన ఇనుము (Iron) పరిమాణం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. తిన్న వెంటనే టీ తాగినప్పుడు ఆహారంలోని ఐరన్ శోషణ 60% నుండి 80% వరకు, కాఫీ తాగినప్పుడు 30% నుండి 50% వరకు పడిపోతుంది. ఫలితంగా ఎంత మంచి పౌష్టికాహారం తిన్నా ఒంటికి రక్తం పట్టని పరిస్థితి ఏర్పడుతుంది.
​టీలో సహజంగా ఉండే ‘టానిన్లు’, కాఫీలో ఉండే ‘క్లోరోజెనిక్ యాసిడ్’, ‘పాలీఫెనాల్స్’ ఆహారంలోని ఇనుముతో చేరి కరిగిపోని రసాయనిక బంధాలను ఏర్పరుస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి శాకాహారం నుంచి లభించే ఇనుమును (Non-Heme Iron) పేగులు గ్రహించకుండా ఇవి అడ్డుకుంటాయి.
​శరీరంలో ఇనుము లోపం ఏర్పడితే తీవ్రమైన అలసట, నీరసం, తలతిరగడం, ఏకాగ్రత లోపించడం, కాస్త నడిచినా ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లోపం క్రమంగా ముదిరి రక్తహీనతకు (అనీమియా) దారితీస్తుంది.
​ *తీసుకోవలసిన జాగ్రత్తలు …….*
1.​ఆహారం తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగాలనుకుంటే కనీసం 45 నిమిషాల నుండి 1 గంట విరామం ఇవ్వాలి.
2.​ఇప్పటికే రక్తహీనత లేదా జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు ఈ వ్యవధిని 1 నుండి 2 గంటల వరకు పొడిగించడం మరింత శ్రేయస్కరం.
3.​టీ, కాఫీలను భోజనంతో కాకుండా ఉదయం 11 గంటల ప్రాంతంలో లేదా సాయంత్రం వేళల్లో విడిగా తీసుకోవడం ఆరోగ్యకరమైన పద్ధతి.

డాక్టర్ ఎం.వి. రమణయ్య
రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక
డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల, నెల్లూరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *