Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

యోగాసన క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపికలు విజయవంతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
యోగాసన క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపికలు విజయవంతం

గోలేటి: కొమరం భీమ్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోలేటి CER క్లబ్‌లో జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026 మరియు SGF జిల్లా సెలక్షన్స్ విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కేసరి ఆంజనేయులు గౌడ్, SGF సెక్రటరీ ఏ.వి. రామ్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో యోగాసన క్రీడను మరింత అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ నెల 2న జరిగిన ఎంపికల్లో సబ్‌-జూనియర్, జూనియర్ విభాగాల్లో బాలురు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ యోగాసన విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, కోచ్‌లకు, పాఠశాలల యాజమాన్యాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కొమరం భీమ్ జిల్లాను యోగాసన క్రీడలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అసోసియేషన్ తరఫున అన్ని విధాలా కృషి చేస్తామని కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ మండ శ్రీనివాస్, కోశాధికారి కుమ్మరి మల్లేష్, కోచ్‌లు కేసరి అలేఖ్య, స్వప్న, క్రీడాకారులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

యోగాసన క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపికలు విజయవంతం

యోగాసన క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపికలు విజయవంతం

యోగాసన క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపికలు విజయవంతం

యోగాసన క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపికలు విజయవంతం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *