వార్త ముఖ్యాంశాలు
- పాడేరు, అక్టోబర్ 3: అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.70.68 కోట్లతో నిర్మించిన 75.64 కి.మీ.
- పొడవైన 30 తారు రోడ్లను అక్టోబర్ 5న ప్రారంభించనున్నారు.
- ఈ మేరకు శనివారం జిల్లా అధికారులు తెలిపారు.
పాడేరు, అక్టోబర్ 3: అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.70.68 కోట్లతో నిర్మించిన 75.64 కి.మీ. పొడవైన 30 తారు రోడ్లను అక్టోబర్ 5న ప్రారంభించనున్నారు. ఈ మేరకు శనివారం జిల్లా అధికారులు తెలిపారు. PM-JANMAN నిధులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించనుండగా, కలెక్టర్, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అనంతగిరి, డుంబ్రిగూడ, హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో రహదారులు నిర్మించారు. వీటితో మారుమూల గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడనున్నాయి.