Saturday, 3 October 2026
  • Home  
  • 27వ డివిజన్‌లో ఇంటింటి కార్యక్రమం
- కడప

27వ డివిజన్‌లో ఇంటింటి కార్యక్రమం

27వ డివిజన్‌లో ఇంటింటి కార్యక్రమం పున్నమి ప్రతినిధి | కడప | అక్టోబర్ 3 కడప నగరంలోని నూతన 27వ డివిజన్ పరిధిలోని ఏఆర్‌పీ కాలనీలో శనివారం “మన కడప–స్వచ్ఛ కడప” కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసుల రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ కన్వీనర్ రంజిత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను ఇంటింటికీ వెళ్లి తెలుసుకోవడంతో పాటు, డివిజన్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై స్థానికులతో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం, స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ప్రజలకు సూచించారు. “మన కడప–స్వచ్ఛ కడప” కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని భాగస్వామ్యం చేస్తూ పరిశుభ్రమైన కడప నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జ్‌లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, డివిజన్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఇట్లు నూతన 27వ డివిజన్ ఇంచార్జ్ గుంటి రాణి

27వ డివిజన్‌లో ఇంటింటి కార్యక్రమం

పున్నమి ప్రతినిధి | కడప | అక్టోబర్ 3

కడప నగరంలోని నూతన 27వ డివిజన్ పరిధిలోని ఏఆర్‌పీ కాలనీలో శనివారం “మన కడప–స్వచ్ఛ కడప” కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసుల రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ కన్వీనర్ రంజిత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.

ప్రజల సమస్యలను ఇంటింటికీ వెళ్లి తెలుసుకోవడంతో పాటు, డివిజన్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై స్థానికులతో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం, స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ప్రజలకు సూచించారు.

“మన కడప–స్వచ్ఛ కడప” కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని భాగస్వామ్యం చేస్తూ పరిశుభ్రమైన కడప నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జ్‌లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, డివిజన్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు.

ఇట్లు
నూతన 27వ డివిజన్ ఇంచార్జ్
గుంటి రాణి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.