డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
కూటమి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని విమర్శించడానికి నాకు ఏ స్థాయి కావాలి? నేను భారత పౌరుడిని. రాజ్యాంగం కల్పించిన హక్కులతో ప్రజా సమస్యలపై ప్రశ్నించే స్థాయి నాకు ఉంది. అంతేకాదు, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ వింగ్ సెక్రటరీగా ప్రజల్లో పనిచేస్తున్న బాధ్యత కూడా నాపై ఉంది అని చేట్ల రామారావు పేర్కొన్నారు.
ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల తరఫున ప్రజా ప్రతినిధులను ప్రశ్నించడం ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు. ప్రభుత్వ నిర్ణయాలు, హామీలు, ప్రజలకు అందుతున్న సంక్షేమం, విద్యా రంగంలో సమస్యలు, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాలపై ప్రశ్నిస్తే దానికి ‘నీ స్థాయి ఏమిటి?’ అని అడగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.
ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు పదవి అవసరం లేదు.. ప్రజల పట్ల బాధ్యత, రాజ్యాంగంపై విశ్వాసం ఉంటే చాలు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాకుండా, వాటికి సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.
కూటమి నాయకుల మాటలు చూస్తుంటే ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా’ అనిపిస్తున్నాయని చేట్ల రామారావు విమర్శించారు. ప్రజా సమస్యలపై తన ప్రశ్నలను కొనసాగిస్తానని చేట్ల రామారావు స్పష్టం చేశారు.
Uploaded Video:


