Friday, 2 October 2026
  • Home  
  • పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి జిల్లా స్థాయి ‘స్వచ్ఛ ఆంధ్ర’ అవార్డు
- చిత్తూరు

పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి జిల్లా స్థాయి ‘స్వచ్ఛ ఆంధ్ర’ అవార్డు

పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి జిల్లా స్థాయి ‘స్వచ్ఛ ఆంధ్ర’ అవార్డు పలమనేరు, అక్టోబర్ 02 ( పున్నమి ప్రతినిధి ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర – 2026” కార్యక్రమంలో భాగంగా పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికైంది. చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ భవనంలో శుక్రవారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సంజీవ కుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్,ఎమ్మెల్యే గురజాల , జిల్లా పరిషత్ చైర్ పర్సన్, జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ , జడ్పీ సీఈఓ, పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ తదితర ముఖ్య అతిథులు హాజరై అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి సంజీవ కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తమ కమిటీ సమిష్టి కృషికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఎల్లప్పుడూ సలహాలు, సూచనలు అందిస్తూ తమను ముందుకు నడిపిస్తున్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, ఈ పురస్కారం దక్కడంలో సహకరించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు, పాలకవర్గ సభ్యులకు, కార్యాలయ సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలిపారు.

పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి జిల్లా స్థాయి ‘స్వచ్ఛ ఆంధ్ర’ అవార్డు

పలమనేరు, అక్టోబర్ 02 ( పున్నమి ప్రతినిధి ) :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర – 2026” కార్యక్రమంలో భాగంగా పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికైంది. చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ భవనంలో శుక్రవారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సంజీవ కుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్,ఎమ్మెల్యే గురజాల , జిల్లా పరిషత్ చైర్ పర్సన్, జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ , జడ్పీ సీఈఓ, పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ తదితర ముఖ్య అతిథులు హాజరై అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి సంజీవ కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తమ కమిటీ సమిష్టి కృషికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఎల్లప్పుడూ సలహాలు, సూచనలు అందిస్తూ తమను ముందుకు నడిపిస్తున్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, ఈ పురస్కారం దక్కడంలో సహకరించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు, పాలకవర్గ సభ్యులకు, కార్యాలయ సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.