Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అరకు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం, జాతీయ సేవా పథకం, విశాఖపట్నం మైభారత్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
  • ప్రిన్సిపాల్ డా.
  • సీహెచ్.

అరకులోయ: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం, జాతీయ సేవా పథకం, విశాఖపట్నం మైభారత్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సీహెచ్. కేశవరావు, అధ్యాపకులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ ఆదర్శాలు, అహింసా సిద్ధాంతం, ప్రపంచ శాంతి, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్రను వక్తలు వివరించారు. చరిత్ర అధ్యాపకురాలు, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ వై. విజయలక్ష్మి గాంధీని గొప్ప రాజనీతిజ్ఞుడిగా అభివర్ణించారు. వైస్ ప్రిన్సిపాల్ కె. నిర్మల, ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు డా. జి. సుధీర్, బి. లచ్చన్నతో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *