Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను కార్యాచరణ లో ఆచరించాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను కార్యాచరణ లో ఆచరించాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను కార్యాచరణలో ఆచరించాలి:కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
—————————————————————–
ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందించడమే మహనీయులకు నిజమైన నివాళి
ప్రతి నిర్ణయంలో అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి
*సత్యం, అహింస, నైతికత ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో భాగం కావాలి*
*సమయపాలనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి*
*ఘనంగా 157వ గాంధీ జయంతి, 122వ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు*
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ
గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను కార్యాచరణలో ఆచరించాలి అని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అన్నారు.
శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో *157వ గాంధీ జయంతి, 122వ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి* సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జాతిపిత మహాత్మా గాంధీ, అలాగే భారతదేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి* చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు.
అదే విధంగా *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, జిల్లా అధికారులు, ఆయా శాఖల సిబ్బంది అందరూ పాల్గొని, జాతిపిత మహాత్మా గాంధీ, అలాగే భారతదేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి* చిత్రపటాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు సమర్పించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. ఈరోజు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, అంతర్జాతీయ అహింసా దినోత్సవం, స్వచ్ఛ భారత్ దివస్ అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ప్రజా సమస్యల పరిష్కారంలో నిష్పక్షపాత విచారణ, అంతరాత్మకు అనుగుణంగా నిర్ణయం, సత్యం, అహింస వంటి విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చంపారన్ ఉద్యమం సందర్భంగా గాంధీజీ రైతుల సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా విచారణ చేపట్టి, వాస్తవాలను నిష్పక్షపాతంగా తెలుసుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారులు కూడా ఏదైనా అంశంపై విచారణ చేపట్టినప్పుడు వాస్తవాలను ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేయాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలను అనవసరంగా తిప్పడం కూడా ఒక రకమైన హింసే అని *కలెక్టర్* అన్నారు. కార్యాలయ నిబంధనల ప్రకారం ఫైళ్లను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, ముఖ్యంగా దివ్యాంగులు, వితంతువులు, పేదలు వంటి వారు కార్యాలయాలకు వచ్చినప్పుడు వారి సమస్యలను సానుభూతితో, సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రజల పనులను అనవసరంగా ఆలస్యం చేయకుండా, వారికి అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాల్లో సేవలు అందించాలన్నారు.
గాంధీజీ చెప్పిన ‘తాలిస్మాన్’ స్ఫూర్తితో అధికారులు ప్రతి నిర్ణయం తీసుకునే ముందు సమాజంలోని అత్యంత పేదలపై ఆ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలని *కలెక్టర్* సూచించారు.
*ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రజా నమ్మకానికి ప్రతీక*
ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం ప్రతి సంబంధిత అధికారి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అక్రమాలు ఉంటే వాటిని గుర్తించి, తొలగించడం, రెవెన్యూ రికార్డులను సక్రమంగా నిర్వహించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆస్తులను రక్షించడం ద్వారా భవిష్యత్తులో పేదలకు భూమి, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి ప్రజా అవసరాలకు ఉపయోగపడే అవకాశాలను కాపాడినట్లవుతుందని అన్నారు.
*ప్రజా సేవల్లో సమయపాలన, బాధ్యత అవసరం*
ప్రతి శాఖాధికారి తన పరిధిలోని సిబ్బంది సమయానికి విధులకు హాజరవుతూ, వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా పర్యవేక్షించాలని *కలెక్టర్* సూచించారు.
*నైతిక విలువలు పాటించాలి*
ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధ (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దానిని బాధ్యతాయుతంగా, నైతిక విలువలకు అనుగుణంగా ఉపయోగించాలని *కలెక్టర్* అన్నారు. సాంకేతికత మన పనిని సులభతరం చేయాలి కానీ, మానవ నిర్ణయ సామర్థ్యాన్ని పూర్తిగా భర్తీ చేసే స్థాయికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
*స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి*
గాంధీజీ ఆలోచనల్లో అట్టడుగు స్థాయి నుంచి పాలన, స్వయం పాలనకు ప్రత్యేక స్థానం ఉందని *కలెక్టర్* తెలిపారు. 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు ప్రాధాన్యత పెరిగిందని, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
స్థానిక సంస్థల్లో ప్రజా నిధులను సరైన విధంగా వినియోగించి, ప్రజలకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించాలని, రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని, నిధుల దుర్వినియోగానికి తావులేకుండా చూడాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
*పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత*
గాంధీజీ పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని *కలెక్టర్* గుర్తు చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్తడబ్బాలను వినియోగించాలని సూచించారు.
పరిశుభ్రమైన కార్యాలయ వాతావరణం ఉద్యోగులకే కాకుండా ప్రజలకు కూడా సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని తెలిపారు.
*లాల్ బహదూర్ శాస్త్రి నైతిక విలువలు ఆదర్శం*
లాల్ బహదూర్ శాస్త్రి అత్యున్నత నైతిక విలువలకు ప్రతీకగా నిలిచారని *కలెక్టర్* అన్నారు. రైల్వే ప్రమాదం జరిగినప్పుడు రైల్వే మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ, రాజీనామా చేసిన ఆయన ఆదర్శాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల నైతిక విలువలను వ్యక్తిగత జీవితంతో పాటు ప్రభుత్వ పాలన, కార్యాలయ పనితీరులోనూ అమలు చేయాలన్నారు.
పేదవారి సమస్యను పరిష్కరించడం, వారికి సకాలంలో ప్రభుత్వ సేవలు అందించడం ద్వారా ఈ మహనీయులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని వెల్లడించారు.
అనంతరం *అదనపు కలెక్టర్ (రెవెన్యూ)* మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ విలువలు, సందేశాలు భారతదేశాన్నే కాకుండా ప్రపంచాన్ని సైతం ప్రభావితం చేసినవని అన్నారు. గాంధీజీ బోధించిన ముఖ్యమైన విలువల్లో అహింస, సర్వోదయం ప్రధానమైనవని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరగాలన్న సర్వోదయ భావన అన్ని తరాలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.
మన జీవితాల్లో గాంధేయ విలువలను ఆచరించడం ద్వారా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలోనూ మంచి మార్పును తీసుకురావచ్చని అన్నారు.
మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు, విలువలను మన జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు.
తదనంతరం 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి, మొత్తం 2 స్వర్ణ పతకాలు, 4 రజత పతకాలు సాధించారు.
అండర్‌–20 విభాగంలో జి. సునిత్ కుమార్ షాట్‌పుట్‌లో 14.97 మీటర్ల దూరంతో స్వర్ణ పతకం, హామర్‌ త్రోలో 48.88 మీటర్ల దూరంతో రజత పతకం సాధించారు. సునిత్ కుమార్ గతంలో పాండిచ్చేరిలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో షాట్‌పుట్‌లో కాంస్య పతకం సాధించిన జాతీయ స్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు.
అండర్‌–20 విభాగంలోనే ఎం. అక్షయ సింధు హామర్‌ త్రోలో 29.98 మీటర్ల దూరంతో స్వర్ణ పతకం, షాట్‌పుట్‌లో 10.27 మీటర్ల దూరంతో రజత పతకం సాధించారు. ఆమె జాతీయ స్థాయిలో షాట్‌పుట్‌లో నాలుగో స్థానంలో నిలిచిన క్రీడాకారిణిగా ప్రతిభ చాటారు.
అండర్‌–16 విభాగంలో ఎస్. సమన్విత షాట్‌పుట్‌లో 9.67 మీటర్ల దూరంతో రజత పతకం సాధించారు. జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన సమన్విత, చెన్నైలో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు.
అదే విధంగా టి. రంజిత్ కుమార్, కోచ్‌, హామర్‌ త్రోలో 38.92 మీటర్ల దూరంతో రజత పతకం సాధించారు.
ఈ నేపథ్యంలో *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* విజేతలను అభినందించి, శాలువాతో సత్కరించి, వారి ప్రతిభను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను కార్యాచరణ లో ఆచరించాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను కార్యాచరణ లో ఆచరించాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను కార్యాచరణ లో ఆచరించాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను కార్యాచరణ లో ఆచరించాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *