Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

పాడి పరిశ్రమపై అవగాహనకు ప్రాధాన్యం గ్రామ సభ అనంతరం పాడి యూనిట్ ఏర్పాటు పరిశీలన – పశువుల బీమాపై అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాడి పరిశ్రమపై అవగాహనకు ప్రాధాన్యం గ్రామ సభ అనంతరం పాడి యూనిట్ ఏర్పాటు పరిశీలన – పశువుల బీమాపై అవగాహన

(పున్నమి ప్రతినిధి)
వేముల మండలం: గ్రామ సభ అనంతరం పాడి పరిశ్రమ యూనిట్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించారు. గ్రామీణ మహిళల జీవనోపాధి, కుటుంబ ఆదాయ వృద్ధికి పాడి పరిశ్రమను ముఖ్యమైన జీవనోపాధి కార్యకలాపంగా అభివృద్ధి చేయాలని గ్రామసమాఖ్య అసిస్టెంట్‌కు సూచించారు. పాడి పశువుల కొనుగోలు, నిర్వహణ, పశువైద్య సేవలు, పశుగ్రాసం, పాల ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలపై కమ్యూనిటీ కోఆర్డినేటర్లు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పశువులకు బీమా సౌకర్యం కల్పించడం ద్వారా అనుకోని ప్రమాదాలు, పశువుల మృతి వంటి సందర్భాల్లో ఆర్థిక రక్షణ లభించేలా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. అర్హులకు పశుసంవర్ధక శాఖ పథకాలు, బీమా సౌకర్యాలపై అవగాహన కల్పించాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *