Friday, 2 October 2026
  • Home  
  • పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు పోలూరులో మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి పంపిణీ
- నంద్యాల

పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు పోలూరులో మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి పంపిణీ

నంద్యాల: అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పింఛన్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాల మండలం పోలూరు గ్రామంలో గురువారం నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మంత్రి, కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా నిర్ణీత సమయంలో పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 16 రకాల పింఛన్లను సుమారు 2.09 లక్షల మందికి రూ.92 కోట్ల మేర పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. అర్హత కలిగిన వారికి నిబంధనల మేరకు పింఛన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, తహసీల్దార్ శ్రీవాణి, ఎంపీడీవో సుగుణశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

నంద్యాల: అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పింఛన్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాల మండలం పోలూరు గ్రామంలో గురువారం నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో మంత్రి, కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా నిర్ణీత సమయంలో పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 16 రకాల పింఛన్లను సుమారు 2.09 లక్షల మందికి రూ.92 కోట్ల మేర పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. అర్హత కలిగిన వారికి నిబంధనల మేరకు పింఛన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, తహసీల్దార్ శ్రీవాణి, ఎంపీడీవో సుగుణశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.