Friday, 2 October 2026
  • Home  
  • దుత్తలూరు: రామయ్య కుటుంబానికి నివేశ స్థల పట్టా మంజూరు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు: రామయ్య కుటుంబానికి నివేశ స్థల పట్టా మంజూరు

జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాల మేరకు నర్రవాడలో బాల కార్మికుడు రామయ్య తల్లిదండ్రులకు తహశీల్దార్ నాగరాజు నివేశ స్థల పట్టాను మంజూరు చేశారు. సోషల్ మీడియాలో గొర్రెల కాపరిగా ఉన్న రామయ్య వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకున్నారు. మంత్రి ఆదేశాలతో కలెక్టర్ నేతృత్వంలో అధికారులు సమన్వయంతో పనిచేసి బాలుడిని గుర్తించి 24 గంటల్లో తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. చదువుకుంటానని రామయ్య చెప్పడంతో రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కుటుంబానికి ఇల్లు, తండ్రికి వైద్యం, తల్లికి స్వయం ఉపాధి కల్పిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. దీంతో రామయ్య గొర్రెల కాపరి పనికి దూరమై బడి బాట పడుతున్నాడు. ఈ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.