కలిగిరి,పున్నమి ప్రతినిధి, తేది : 23-11-2026,
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ సోమవారం కలిగిరి మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. కలిగిరిలోని ఎస్టీ కాలనీ, ఎర్ర తోటతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఆయనతో మాట్లాడిన కలిగిరి వాసులు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను మరియు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అభినందిస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కలిగిరి పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు ఎమ్మెల్యే అభిమానులు పెద్ద ఎత్తున, అత్యంత ఉత్సాహంతో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు.








వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్